సుప్రీం కోర్టులో ఉద్ధవ్ థాక్రేకు ఊరట

Supreme Court: సుప్రీం కోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు ఊరట లభించింది.

Update: 2022-08-04 14:30 GMT

సుప్రీం కోర్టులో ఉద్ధవ్ థాక్రేకు ఊరట

Supreme Court: సుప్రీం కోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు ఊరట లభించింది. అసలైన శివసేన తమదే, విల్లు-బాణం గుర్తు తమకే కేటాయించాలంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై ప్రతిస్పందన వెల్లడించేందుకు సమయం కావాలని ఉద్ధవ్ సుప్రీంను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఉద్ధవ్ వర్గం వాదన విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదంటే తమదేనని షిండే, ఉద్ధవ్ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా..? వద్దా..? అన్న అంశంపై ఈ నెల 8న సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోనుంది. 

Tags:    

Similar News