Supreme Court: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
Supreme Court: ఢిల్లీలో క్రాకర్స్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీపావళి పండుగ నేపథ‌్యంలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది.
Supreme Court: ఢిల్లీలో క్రాకర్స్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీపావళి పండుగ నేపథ‌్యంలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీతో పాటు NCR ప్రాంతాలకు ఈ తీర్పు వర్తిస్తుంది. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఆ క్రాకర్స్ కాల్చుకోవచ్చు అని కోర్టు చెప్పింది.
కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని, క్యూఆర్ కోడ్‌థో అనుమతి ఉన్న క్రాకర్స్‌ను మాత్రమే అమ్మేవిధం చర్యలు తీసుకోవాలన్నది సుప్రీంకోర్టు. పోలీసలు పెట్రోలింగ్ బృందాలు నిఘా పెట్టాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది.