Himachal Pradesh: సీఎం పదవికి రాజీనామా చేసిన సుఖ్వీందర్‌సింగ్
Himachal Pradesh: మరో సీఎంను వెతికే పనిలో కాంగ్రెస్ హైకమాండ్
సీఎం పదవికి రాజీనామా చేసిన సుఖ్వీందర్‌సింగ్
Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల చిచ్చు రేగిన నేపథ్యంలో సీఎం రాజీనామా చర్చనీయంగా మారింది. ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేయగా.. తాజాగా సీఎం పదవికి రాజీనామా చేశారు సుఖ్వీందర్‌సింగ్. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు.
దీంతో మరో సీఎం అభ్యర్థిని వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఉదయం అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్‌ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు.