Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. నలుగురి మృతి
Jammu Kashmir: వరదల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి, మృతుల్లో ముగ్గురు చిన్నారులు...
జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. నలుగురి మృతి
Jammu Kashmir: ఆకస్మిక వరదలతో జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా అతలాకుతలం అవుతోంది. వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఉండగా.. వరదల్లో నలుగురు మృతి చెందారని, ఒకరు సజీవంగా ఉన్నారని, మరొకరి ఆచూకీ దొరకడం లేదని పేర్కొన్నారు. మరోవైపు.. గల్లంతయిన వ్యక్తికోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వరదలకు రఫియాబాద్ ప్రాంతంలోని వాటర్ గ్రామంలో పాఠశాలలతో సహా పంట పొలాలు, ప్రభుత్వ భవనాలను వరద నీరు ముంచెత్తింది.