Navy: మరో ఘనత సాధించిన ఇండియన్ నేవీ.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
Navy: టార్పిడో పేరు, ఇతర ఫీచర్లను వెల్లడించని నేవీ
Navy: మరో ఘనత సాధించిన ఇండియన్ నేవీ.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
Navy: ఇండియన్ నేవీ మరో ఘనత సాధించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ మంగళశారం పరీక్షించింది. నీటి లోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో విజయవంతంగా ఛేదించింది. హెవీ వెయిట్ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశామని నేవీ పేర్కొంది. ఆత్మ నిర్భరతలో భాగంగా భవిష్యతులో మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనమని తెలిపింది. ఈ టార్పిడో పేరును, ఇతర ఫీచర్లను నేవీ వెల్లడించలేదు. హిందూ మహాసముద్రంలో చైనా కారణంగా ముప్పు పెరుగుతుండటంతో నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.