Train Fire: అర్థరాత్రి అగ్నిప్రమాదం.. అనకాపల్లి దగ్గర రైలులో మంటలు..ఒకరు సజీవదహనం..!!
Train Fire: అర్థరాత్రి అగ్నిప్రమాదం.. అనకాపల్లి దగ్గర రైలులో మంటలు..ఒకరు సజీవదహనం..!!
Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు సజీవ దహనమై మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్‌గా గుర్తించారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లోని B1 ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో చంద్రశేఖర్ సుందర్ మంటల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేలోపే ఆయన సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు.
ఈ రైల్లోని రెండు ఏసీ కోచ్‌లలో కలిపి 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదం కారణంగా రైలు సేవలు కొంతసేపు నిలిచిపోయాయి. బాధిత ప్రయాణికులను బస్సుల ద్వారా ఎర్నాకుళానికి తరలించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది.