Stock Markets: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట
Stock markets: భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి
Representational Image
Stock Markets: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి క్రితం సెషన్ లో సరికొత్త రికార్డులతో భారీ లాభాలను అందించిన సూచీలు తాజా సెషన్ లో ప్రతికూల బాటన సాగుతున్నాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 200 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 14,100 వద్దకు చేరాయి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నాహక చర్యలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి వంటి కీలక అంశాల నేపధ్యంలో మదుపర్ల అప్రమత్తత మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.