South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో ఆరు రైళ్ల రద్దు

South Central Railway: ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిన్న తాత్కాలికంగా రద్దు చేసింది.

Update: 2021-05-14 04:41 GMT

South Central Railway:(File Image)

South Central Railway: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేయడానికి వెనకాడుతుంటంతో రైళ్లు బోసి పోతున్నాయి. మొదటి వేవ్‌ ప్రారంభం అయిన తర్వాత గత సంవత్సరం మార్చి 22వ తేదీ నుంచి రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి విదితమే. కరో నా ఉధృతి తగ్గడంతో ఆరు నెలలుగా ప్రధాన రూట్లలో రైల్వేశాఖ ప్రీమియం ధరలతో ప్రత్యేక రైళ్లను ప్రవేశ పెడుతూ వచ్చింది. నిదానంగా కరోనా పరిస్థితుల నుంచి బయటపడి దూర ప్రాం తాలకు రైళ్లలో వెళ్లడానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడింది. పండుగలకు,ప్రత్యేక రోజు ల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన రైళ్లను ప్రవేశపెట్టారు. త్వరలో రైళ్లను ప్రత్యేక రైళ్ల హోదాలో కాకుండా రెగ్యులర్‌ బేసిస్ లో నడపే అవకాశాలు కనిపిస్తున్న తరుణంగా కరోనా సెకెండ్‌ వేవ్‌ అశని పాతంలా వచ్చిపడింది.

కరోనా కేసులు పెరిగిపోతుం డటం, వ్యాక్సినేషన్ మందగించడం,తదితర కారణాలతో భయాందోళన చెందుతున్న జనం ప్రయాణాలను వాయు దా వేసుకుంటున్నారు. రైల్వే స్టేషన్లలో ఉన్న ప్యాసిజరు, రిజర్వేషన కౌంటర్లు కూడా ఖాళీ గా దర్శనమిస్తున్నాయి. ఈ కారణాలుగా ఆక్యుపెన్సీ తక్కు వగా ఉన్న రైళ్లను రద్దుచేసే పనిలో రైల్వేశాఖపడింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిన్న తాత్కాలికంగా రద్దు చేసింది. విశాఖపట్టణం-కడప (07488) రైలును నేటి నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేయగా, కడప-విశాఖ రైలు (07487)ను రేపటి నుంచి జూన్ 1 వరకు రద్దు చేసింది.

అలాగే, విశాఖ-లింగంపల్లి (02831), లింగంపల్లి-విశాఖ (02832) రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 1 వరకు నిలిపివేసింది. ముంబై సీఎస్‌టీ-ఆదిలాబాద్ (01141) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీ నుంచి, ఆదిలాబాద్-ముంబై సీఎస్‌టీ (01142) రైలును 18 నుంచి రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ రైళ్లను తిరిగి ఎప్పటి నుంచి పునరుద్ధరించేదీ దక్షిణ మధ్య రైల్వే వెల్లడించలేదు.

Tags:    

Similar News