Sonu Sood: ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతోన్న సోనూ సూద్

Sonu Sood: కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే సంచనల నిర్ణయం తీసుకున్నారు సోనూ సూద్

Update: 2021-05-11 06:33 GMT

సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: రీల్ హీరో సోనూ సూద్ రియల్ హీరోగా మారిపోయాడు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఈ తరహా ఉత్పాతాన్ని ఎవ్వరూ ఊహించలేదు. లక్షల సంఖ్యలో మహమ్మారి బారిన పడుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. చాలా మంది ఆసుప్రతుల్లో బెడ్లు దొరక్క, ఒక వేళ దొరికినా ఆక్సిజన్ అందక కన్నుమూస్తున్నారు. ఇప్పటికే కేంద్రం యుద్ధ ప్రాతిపదికన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ కంటెనర్స్ తెప్పిస్తున్నాయి. మరోవైపు దేశంలో వివిధ ప్రదేశాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్‌ నెలకొల్పే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా బాధితుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ దేశానికి సోనూ సూద్ ఓ ఆక్సిజన్ ప్లాంట్ కోసం ఆర్డర్ చేశారట. మరో రెండో వారాల్లో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్టు సోనూ సూద్ తెలిపారు. ఫ్రాన్స్ తో పాటు వివిధ దేశాలతో మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సోనూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. ప్రతిదీ సమయానికి అందేలా తన వంతు సాయం చేయడానికి రెడీగా ఉండాలని తన టీమ్‌కు సూచించినట్టు సోనూ తెలిపారు.

గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూశారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి మనసుల్లో దేవుడిగా కొలువైయ్యారు. కొంత మంది ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. సోనూ సూద్ సాయం పొందిన వాళ్లు కొంత మంది ఏకంగా తమ పుట్టిన బిడ్డలకు సోనూ పేరు పెట్టుకున్నారు.

Tags:    

Similar News