నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి ఈడీ సమన్లు.. ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఈడీ నోటీసులు
*కరోనా నుంచి కోలుకోనందున మరింత గడువు కోరినట్లు సమాచారం
Sonia Gandhi: ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఈడీ నోటీసులు
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోనియా గాంధీ ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. గతవారం నుంచి సోనియ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులు ఇంకా నిర్ధారించలేదు. అయితే మనీలాండరింగ్ కేసులో జూన్ 8న విచారణకు హాజరవ్వాలని ఈడీ గతంలో నోటీసులు జారీ చేసింది. దీంతో కరోనా నుంచి ఇంకా కోలుకోని సోనియా నేడు విచారణకు హాజరయ్యే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే తాను విచారణకు హాజరుకాలేనని సోనియా గాంధీ ఈడీ లేఖ రాశారు. కరోనా నుంచి కోలుకోనందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఈడీ నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఇదే కేసులో రాహుల్ గాంధీ ఈనెల 2న విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విదేశీ పర్యటనలో ఉన్నానని జూన్ 5 తర్వాత వస్తానని చెప్పారు. దీంతో ఈడీ విచారణ తేదీని ఈనెల 13కు మార్చింది.