Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ

Bharat Jodo Yatra: బ్రహ్మదేవరహళ్లి మీటింగులో పాల్గొననున్న కాంగ్రెస్ అధినేత్రి

Update: 2022-10-06 05:31 GMT

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో సోనియాగాంధీ పాలుపంచుకున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర కర్ణాటకలో సాగుతోంది. యాత్రలో పాల్గొనేందుకు జకన్నహళ్లి చేరుకున్న సోనియా.. మాండ్యా జిల్లాలోని పాండపుర తాలూకా నుంచి ప్రారంభమైన యాత్రలో పాలుపంచుకున్నారు. బ్రహ్మదేవరహళ్లి జరుగునున్న సమావేశంలో సోనియా గాంధీ పాల్గొంటారు.

సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోకి ఎంటరైంది. కేరళ సరిహద్దులోని చామరాజ్‌నగర్‌లోని గుండులుపేటలో అడుగుపెట్టడం ద్వారా రాహుల్ కర్ణాటకలో కాలు మోపారు. ఆశ, ప్రేమ, విజయాల ప్రయాణమిదని, భారత్ జోడో యాత్ర స్ఫూర్తి ఇదే అని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది.

పాండవపుర తాలూకా వద్ద ప్రారంభమైన ఈ యాత్ర నేడు నాగమంగళ తాలూకా వద్ద ముగుస్తుంది. ఇక్కడి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదురుగా ఉన్న మడకె హోసూరు గేట్ వద్ద రాత్రి బస చేస్తారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో 21 రోజులపాటు... 511 కిలోమీటర్ల మేర సాగుతుంది. చామరాజనగర్, మైసూరు, మాండ్యా, టుముకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది.  

Tags:    

Similar News