Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ..ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు..!
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించింది.
Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ..ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు..!
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. గత కొన్ని రోజులుగా సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించిందని, ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ తరువాత ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ ఆదివారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
సర్ గంగా రామ్ హాస్పిటల్ ఒక ప్రకటన విడుదల చేసి సోనియా ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చింది. 'కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. కడుపు నొప్పి సమస్య కారణంగా ఆమెను గ్యాస్ట్రో డిపార్ట్‌మెంట్‌లో చేర్చారు, పరిశీలనలో ఉన్నారు' అని ఆసుపత్రి తెలిపింది.
అంతకుముందు జూన్ 7న, సోనియా ఆరోగ్యం క్షీణించింది.దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు. అయితే తరువాత ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇది సాధారణ హెల్త్ చెకప్ అని తెలిపారు. సోనియా గాంధీ వయసు 78 సంవత్సరాలు. ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు. ఆమె చాలా కాలంగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కృషి చేశారు. 2004 లో యుపిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, సోనియాకు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేశారని, కానీ ఆమె ఈ పదవిని తిరస్కరించి మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిని చేసిందని చెబుతారు. ఆమె క్రియాశీల రాజకీయాల్లో తక్కువగా కనిపిస్తారు. కానీ పార్టీకి వ్యూహాత్మక, సలహాదారు పాత్రలో కొనసాగుతున్నారు.