కత్తితో ఒక దెబ్బ వేయగానే అక్కడ నుంచి పారిపోయిన సోనమ్.. హనీమూన్ కేసు సీన్ రిక్రియేషన్‌లో బయటపడ్డ కొత్త విషయాలు
29ఏళ్ల రాజాపై మొదటిసారి విశాల్ కత్తితో పొడిచిన తర్వాత అతనికి రక్తస్రావం జరిగింది అలాగే అతను నొప్పితో కేకలు వేయడం ప్రారంభించడంతో సోనమ్ అక్కడ నుంచి పారిపోయింది.
కత్తితో ఒక దెబ్బ వేయగానే అక్కడ నుంచి పారిపోయిన సోనమ్.. హనీమూన్ కేసు సీన్ రిక్రియేషన్‌లో బయటపడ్డ కొత్త విషయాలు
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీ నియమించుకున్న హంతకులలో ఒకడైన విశాల్ సింగ్ చౌహాన్ సోనమ్ భర్త రాజా రఘువంశిపై మొదటిసారి కత్తితో ఎటాక్ చేసినప్పుడు అక్కడ నుంచి సోనమ్ పారిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా నిందితులను ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతానికి తీసుకెళ్లి రాజా రఘువంశీ హత్య సీన్ రిక్రియేషన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రీస్ రిక్రియేషన్ సమయంలో ఎన్నో కొత్త విషయాలు బయటపడినట్లు పోలీసులు చెప్పారు.
29ఏళ్ల రాజాపై మొదటిసారి విశాల్ కత్తితో పొడిచిన తర్వాత అతనికి రక్తస్రావం జరిగింది అలాగే అతను నొప్పితో కేకలు వేయడం ప్రారంభించడంతో సోనమ్ అక్కడ నుంచి పారిపోయింది. ఈ తర్వాత హంతకులు రాజాను మళ్లీ కత్తితో అనేక సార్లు పొడిచిన తర్వాత, రాజా చనిపోయిన తర్వాత మళ్లీ సోనమ్ అక్కడకు తిరిగి వచ్చిందని సీన్ రిక్రియేషన్ చేసిన సమయంలో పోలీసులకు తెలిసింది.
హత్యను ధర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం(SIT) సోనమ్‌తో సహా నిందితులందరినీ రాజధాని షిల్లాంగ్ నుండి 65 కిమీ దూరంలో ఉన్న మేఘాలయలోని సోహ్రాకు తీసుకెళ్లారు. వారితో నేరం జరిగిన ప్రాంతంలో ఎలా నేరం జరిగిందనే ప్రాసెస్‌ను మళ్లీ చేయించారు. అప్పుడు సోనమ్ రాజా చనిపోయిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చిందనే కొత్త విషయం తెలిసింది. అలాగే హంతకులు వాడిన మరొక కత్తి కూడా సీన్ రిక్రియేషన్ జరిగిన ప్రాంతంలో లభించింది. అదే లోయలో రియాట్ అర్లియాంగ్ వద్ద ఉన్న వీ సావ్ డాంగ్ పార్కింగ్ లాట్ కింద ఈ రెండో కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండో కత్తి దొరకకముందు వరకు ఒక కత్తినే హంతకులు హత్యకు వాడినట్లు పోలీసులు భావించారు. ఇప్పుడు ఈ రెండో కత్తి దొరకడంతో దాని ద్వారా విచారణ చేపట్టారు.
గత నెలలో మేఘాలయకు కొత్త జంట అయిన సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్‌కు వెళ్లారు. అయితే ఈ హనీమూన్‌లో రాజా హత్యగురయ్యాడు. పోలీసులు విచారణలో సోనమ్ ఆకాష్, విశాల్ , ఆనంద్ అనే ముగ్గురి వ్యక్తులతో ఈ హత్య చేయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పోలీసులు తాజా సీన్ రిక్రియేషన్ జరిపిన తర్వాత కొత్త విషయాలు బయటపడడంతో ఈ కేసును మరికొంత లోతుగా విచారణను చేస్తున్నారు.