జమ్మూ & కాశ్మీర్ లో సోషల్ మీడియా నిషేధం ఎత్తివేత.. 2 జిలో ఇంటర్నెట్ కు అనుమతి
కాశ్మీర్ లోయలో వైర్డు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు పూర్తిగా పునరుద్ధరించారు. అంతేకాదు బుధవారం సాయంత్రం నుండి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లకు కూడా అనుమతి లభించిందని బిఎస్‌ఎన్‌ఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే మొబైల్ ఇంటర్నెట్ సేవలు కేవలం 2 జి కి మాత్రమే పరిమితం చేశారు. హై-స్పీడ్ 4 జి నెట్‌వర్క్ లకు మాత్రం ఇంకా అనుమతి లభించలేదు. అలాగే జమ్మూ కాశ్మీర్లో యాక్సెస్ చేసే వెబ్‌సైట్ల జాబితాను ప్రభుత్వం అందించింది.
ఇది కాకుండా, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లలో కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి, అయితే ఉన్నతాధికారుల ధృవీకరణ తరువాతె అనుమతి ఇస్తారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) షలీన్ కబ్రా జారీ చేసిన ఉత్తర్వులో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ లైన్లలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు మరియు ఇతర వెబ్‌సైట్‌లకు అనుమతి ఉందని, 2 జి నెట్‌వర్క్‌లు మార్చి 17 వరకు మాత్రమే పనిచేస్తాయని చెప్పారు. ఈ మేరకు కొన్ని షరతులు విధించారు.
*ఇంటర్నెట్ వేగం 2G కి మాత్రమే పరిమితం.
*పోస్ట్-పెయిడ్ సిమ్ ఉన్నవారికి ఇంటర్నెట్ సేవలు, పోస్ట్-పెయిడ్ సిమ్‌ల వినియోగదారులు. ధృవీకరణకు తర్వాత ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే అవకాశం.
*స్థిర ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది.
*మునుపటి ఉత్తర్వులో, J&K పరిపాలన 1,600 వెబ్‌సైట్‌లను (ఎక్కువగా విద్య, బ్యాంకింగ్, వ్యాపారం మరియు ప్రభుత్వానికి సంబంధించినది) మాత్రమే అనుమతి ఇచ్చారు. అందులో కొన్నింటిని యాడ్ చేశారు.
వాస్తవానికి జనవరిలో ప్రభుత్వం కాశ్మీర్ లోయలోని కొన్ని సంస్థలకు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను పాక్షికంగా పునరుద్ధరించింది. ఆ సమయంలో సోషల్ మీడియా వెబ్‌సైట్లును బ్లాక్ చేశారు.. కానీ "ఇ-బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన సేవలతో" వ్యవహరించే 1,600 ప్రభుత్వ-ఆమోదించిన వెబ్‌సైట్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. తాజాగా 2జీ సేవలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 పై వివాదాస్పద నిర్ణయం తీసుకున్న తరువాత కేంద్రం విధించిన విస్తృతమైన సమాచార మార్పిడి తరువాత ఈ వార్త వచ్చింది.