Jammu Kashmir Snow Fall: జమ్ముకశ్మీర్‌లో మంచు దుప్పటి.. రాజోరీలోని మొఘల్ రోడ్డు మూసివేత
Jammu Kashmir Snow Fall: మంచు వర్షంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు
Jammu Kashmir Snow Fall: జమ్ముకశ్మీర్‌లో మంచు దుప్పటి.. రాజోరీలోని మొఘల్ రోడ్డు మూసివేత
Jammu Kashmir Snow Fall: జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మంచు కురవడం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నో ఫాల్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూమతి మిగుల్చుతోంది. శీతాకాలం ప్రారంభమవుతుండటంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. భారీగా మంచువర్షం కురుస్తుండటంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. జమ్ముకశ్మీర్‌తో పాటు కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు మంచు వర్షంలో తడిసిముద్దయ్యాయి. మంచు కారణంగా రాజోరీలోని మొఘల్ రోడ్డును అధికారులు మూసివేశారు. రోడ్డుపై ఉన్న మంచును తొలగించే పనిలో నిమగ్నయ్యారు.
జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జమ్ములో 18.7డిగ్రీల సెల్సియస్, కత్రాలో 16.4, బటోట్‌లో 9.4, భదర్వాలో 8.6, బనిహాల్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. లద్దాఖ్‌లోని ద్రాస్, లేహ్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఆ ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ కప్పేసింది మంచు.