Himachal Pradesh: రోహ్‌తంగ్ పాస్‌లో గరిష్టంగా 15 అంగుళాల హిమపాతం

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌ను కప్పేసిన మంచు దుప్పట్లు

Update: 2023-01-26 07:59 GMT

Himachal Pradesh: రోహ్‌తంగ్ పాస్‌లో గరిష్టంగా 15 అంగుళాల హిమపాతం

Himachal Pradesh: హిమమాచల్‌ప్రదేశ్ రోడ్లను దట్టంగా మంచు కప్పేసింది. గత 24 గంటల్లో హిమాపాతం కారణంగా అనేక రహదారులు మూతపడ్డాయి. 4 జాతీయ రహదారులతోపాటు 252 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. రోహ్‌తంగ్ పాస్ NH-03, జలోరి పాస్ NH-305 సహా ముఖ్యమైన హైవేలను భారీగా మంచుదుప్పట్లు కప్పేశాయి. రోహ్‌తంగ్ పాస్‌లో గత 24 గంటల్లో గరిష్టంగా 15 అంగుళాల హిమపాతం నమోదైంది. తాజాగా సిమ్లాలోని నరకంద ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తోంది. విద్యుత్, మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో రెండు రోజులు వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ యాక్టివ్‌గా ఉంటుందని, హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించారు.

Tags:    

Similar News