Hidma: స్వగ్రామానికి చేరుకున్న హిడ్మా మృతదేహం

Hidma: మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని ఆయన స్వగ్రామమైన పూవర్తికి తరలించారు.

Update: 2025-11-20 06:06 GMT

Hidma: మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని ఆయన స్వగ్రామమైన పూవర్తికి తరలించారు. రెండు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే.

పోస్ట్‌మార్టం ప్రక్రియల అనంతరం హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో, ఆయనను చివరిసారిగా చూసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. హిడ్మా తల్లి పుంజి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో పూవర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News