Viral Video: హృదయవిదారక ఘటన... అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో..
Viral Video: మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది.
Viral Video: హృదయవిదారక ఘటన... అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో..
Viral Video: మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని తల్లి సాయంతో ఏడేళ్ల కుమారుడు తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అంబులెన్స్రాకపోవడంతో మూడు కిలోమీటర్లు తన తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బాధితుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడని, 20 నిమిషాలైనా అంబులెన్స్రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు 108కి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.