Siddaramaiah: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య
Siddaramaiah: రేపు సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం
Siddaramaiah: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య
Siddaramaiah: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాసేపట్లో అధికారికంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న డీకే శివ కుమార్‌తో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. అధికారికంగా సిద్ధరామయ్య పేరును ఖర్గే ప్రకటించిన తర్వాత సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ, ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఆయనకు వేరొక కీలక పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పని చేయడంతోపాటు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉండటంతో ఆయనవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సామాన్య ప్రజల్లో ఆయనకు ఆకర్షణ ఉండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయినట్లు చెప్తున్నారు.