Karnataka: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య..?

Karnataka: ఇవాళ అధికారికంగా ప్రకటించే ఛాన్స్

Update: 2023-05-17 06:41 GMT

కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య..?

Karnataka: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే సస్పెన్ ఇంకా వీడటం లేదు. పార్టీ విజయానికి కృషిచేసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ బలమైన నేతలే కావడంతో సీఎం ఎంపికలో పీఠముడి ఏర్పడింది. ఇందులో భాగంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో రాహుల్ గాంధీ సమావేశమై.. సీఎం అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సిద్ధరామయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముగ్గురు డిప్యూటీ సీఎంలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లింగాయత్, ముస్లిం, దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలకు డిప్యూటీ సీఎం అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంబీ పాటిల్, ఖాదీర్, జి. పరమేశ్వర డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు.

Tags:    

Similar News