Krishna Janmashtami: దేశమంతటా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
Krishna Janmashtami 2022: దేశమంతటా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
Krishna Janmashtami: దేశమంతటా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
Krishna Janmashtami 2022: దేశమంతటా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రపంచానికి గీతాసారం అందించిన కృష్ణ భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ హిందూ సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోజికోడ్, పూరీ వంటి అనేక స్థలాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు శ్రీనగర్లోనూ ఇస్కాన్ కార్యకర్తలు ఎంతో భక్తిపూర్వకంగా వీధుల్లో కృష్ణ గానం చేశారు. ముంబైలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఎంతో ఉద్విగ్నంగా సాగుతోంది. మహారాష్ట్రలో ఈసారి ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని అధికారికంగా గుర్తించారు.