Maharashtra: మహారాష్ట్ర ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త

Maharashtra: మహారాష్ట్రలో 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 55,469 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Update: 2021-04-07 04:18 GMT

Maharashtra:(Photo the hans india)

Maharashtra: భారత్‌లో కరోనా పగ్గాలు లేకుండా విస్తరిస్తోంది. అమెరికా తర్వాత ఆ స్థాయిలో రోజువారీ కేసులు భారత్‌లోనే నమోదవ్వడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తాజాగా 96,982 మందికి కరోనా సోకింది. కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే ఎప్పుడు లేనంతగా రికార్డు స్థాయిలో 55,469 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గు చూపింది. మాల్స్, సినిమా హాల్స్‌, బార్లు, రెస్టారెంట్ల మూసివేతకు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర స‌ర్కార్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. పుణె న‌గ‌రంలో ఆస్ప‌త్రుల్లో స‌రిప‌డ బెడ్లు లేక‌పోవ‌డంతో ఆస్ప‌త్రి వెలుప‌లే చికిత్స పొందుతున్నారు. దీంతో త‌మ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను స‌మ‌కూర్చాల‌ని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే విజ్ఞ‌ప్తి చేశారు. కొంద‌రి ఆరోగ్య ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని, వీలైనంత త్వ‌ర‌గా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను పంపాల‌ని కోరారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి మంగళవారం నాటికి 30 లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోసారి కరోనా మరణాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఆ జాబితాలో బ్రెజిల్, భారత్ ముందువరుసలో ఉన్నాయి. లాక్‌డౌన్లు, కఠిన ఆంక్షలతో ప్రజల్లో వచ్చిన విసుగు వల్ల యూకే, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో తాజాగా కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Tags:    

Similar News