కాబోయే అల్లుడితో అత్త జంప్.. వెతికి మరీ దొరకబట్టిన పోలీసులు. ఎక్కడున్నారంటే..?

Viral News: వార్తలు చూడాలంటేనే దడుసుకునే పరిస్థితి వచ్చింది. నేరాలు, ఘోరాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటి స్థానంలో ఇప్పుడు వింత వార్తలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2025-04-12 04:51 GMT

కాబోయే అల్లుడితో అత్త జంప్.. వెతికి మరీ దొరకబట్టిన పోలీసులు. ఎక్కడున్నారంటే..?

Shocking UP Incident Brides Mother Elopes with Groom 

Viral News: వార్తలు చూడాలంటేనే దడుసుకునే పరిస్థితి వచ్చింది. నేరాలు, ఘోరాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటి స్థానంలో ఇప్పుడు వింత వార్తలు చోటు చేసుకుంటున్నాయి. మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మార్చేసే సంఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. కట్టుకున్న భర్తలను వదిలి ప్రియుడితో పారిపోతున్న మహిళలలు కొందరైతే.. ఏకంగా చంపేస్తున్న వారు మరి కొందరు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన సమాజం ఎటు వెళ్తుందన్న ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. కూతురి పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుండగా, ఆమె తల్లి మాత్రం కాబోయే అల్లుడితో కలిసి పరారైంది. ఈ ఘటన స్థానికులను, రెండు కుటుంబాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. మనోహర్‌పూర్‌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్‌ తన కుమార్తె శివానికి రాహుల్‌ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. రాహుల్‌ థానా చర్రా ప్రాంతానికి చెందినవాడు. వీరి వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా, పెళ్లికి కేవలం తొమ్మిది రోజులు మిగిలి ఉండగానే ఈ అనూహ్య సంఘటన జరిగింది.

రాహుల్, తన అత్త అయిన శివానీ తల్లితో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉండేవాడు. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాతే వారి మధ్య అనుబంధం ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇద్దరూ రోజూ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకునేవారని కాబోయే వధువు పోలీసులకు తెలిపింది.

ఒక రోజు ఇద్దరూ “పెళ్లి షాపింగ్‌కి వెళ్తున్నాం” అంటూ ఇంటినుంచి బయల్దేరి… తిరిగి రాలేదు. తీరా గమనిస్తే రూ.3.5 లక్షల నగదు, రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు కూడా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అత్త-అల్లుడి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు.

తొలుత వాళ్లు అలీఘర్‌ వదిలి వెళ్లిపోయినట్లు నిర్ధారించగా, ఆపై వారిని ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఇది అలీఘర్‌ నుంచి దాదాపు 206 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాహుల్‌ గతంలో అక్కడే పని చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు అదే ప్రాంతంలో వారిని వెతుకుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

Tags:    

Similar News