China Loan Apps: చైనా లోన్ యాప్స్ కుంభకోణంలో షాకింగ్ అంశాలు
China Loan Apps: లోన్ యాప్స్ పేరుతో రూ.5వేల కోట్లను చైనాకు తరలింపు
చైనా లోన్ యాప్ స్కాంలో భారీ కుంభకోణం (ఫైల్ ఇమేజ్)
China Loan Apps: చైనా లోన్ యాప్స్ కుంభకోణంలో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ సీసీఎస్‌లో మరో కేసు నమోదు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ మొత్తం వ్యవహారంలో కొత్త దందా వెలుగు చూసింది. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్లు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నకిలీ వే బిల్స్‌పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల విచారణలో మరో 450 కోట్లు చైనాకు తరలించినట్లు గుర్తించారు. ఈడీ ఫిర్యాదుతో లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు.