కూతురి హత్య కేసు : జైలు నుంచి పీటర్ ముఖర్జియా విడుదల

ఐఎన్‌ఎక్స్ మాజీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పీటర్ ముఖర్జీయా.. షీనా బోరా హత్య కేసులో నాలుగేళ్ల తర్వాత శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

Update: 2020-03-21 04:46 GMT
Sheena Bora, peter Mukerjea

ఐఎన్‌ఎక్స్ మాజీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పీటర్ ముఖర్జీయా.. షీనా బోరా హత్య కేసులో నాలుగేళ్ల తర్వాత శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ముఖర్జీయాకు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. సిబిఐ అప్పీలుకు సమయం ఇచ్చారు.. ఈ కూర్మంలో ఉత్తర్వుపై ఆరు వారాల స్టే విధించింది. దాంతో ఇది శుక్రవారం ముగిసింది. అతని బెయిల్‌ను సవాలు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవడంతో ఆయన బయటికి రావడానికి మార్గం సుగమం అయింది.

ఈ మేరకు అతనికి జస్టిస్ నితిన్ సాంబ్రే ఉత్తర్వులు ఇచ్చారు. ముఖర్జీయా బైపాస్ సర్జరీ చేయించుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.ఆయన అప్పటికే 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో రూ .2,00,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు తన కుమారుడిని సంప్రదించవద్దని ముఖర్జియాను ఆదేశించింది. కాగా సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్‌ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్‌ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. 2015 లో అరెస్టయిన ముఖర్జీయా గత నెలలో బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత కూడా జైలులో ఉండటం విశేషం.

Tags:    

Similar News