Shashi Tharoor: రాజస్థాన్ సీఎం గెహ్లోత్‌తో శశి థరూర్ భేటీ
Shashi Tharoor: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల విషయమై సమావేశమయ్యారని తెలిపిన కాంగ్రెస్ వర్గాలు
Shashi Tharoor: రాజస్థాన్ సీఎం గెహ్లోత్‌తో శశి థరూర్ భేటీ
Shashi Tharoor: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల విషయమై వారిద్దరూ సమావేశమయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇద్దరూ ఏఐసీసీ అధ్యక్ష బరిలో ఉన్నందున, పార్టీ భవిష్యత్తుపైనా వారు చర్చించారని పేర్కొన్నాయి.
అయితే.. తాను అధ్యక్ష బరిలో లేనని, రాహుల్ గాంధీ ఆ పదవిని స్వీకరించేలా ఆయన్ను ఒప్పించేందుకు శతవిధాలా యత్నిస్తామని గెహ్లోత్ గత వారం స్పష్టం చేశారు. మరోవైపు.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే తాను అధ్యక్ష పోటీలో ఉండేది లేనిది నిర్ణయిస్తానని థరూర్ పేర్కొన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మెహెంగాయ్ పర్ హల్లా బోల్ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెహ్లోత్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు.