Tharoor vs Gehlot: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్ పోటీ ఖరారు..!
Tharoor vs Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పోటీ దాదాపు ఖరారైంది.
Tharoor vs Gehlot: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్ పోటీ ఖరారు..!
Tharoor vs Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పోటీ దాదాపు ఖరారైంది. ఆయన నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. దీంతో ఈ పదవి రేసులో అధికారికంగా బరిలో దిగిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. ఈ మేరకు ఇటీవల పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. అందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మరోవైపు తానూ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ప్రకటించారు. అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తులను రాహుల్ గాంధీ ఇప్పటికే తిరస్కరించారు. ఈ క్రమంలోనే గెహ్లాట్ తన పోటీపై స్పష్టతనివ్వడంతో రాహుల్ బరిలో దిగబోరని నిర్ధారణ అయినట్లేనంటూ పార్టీ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్, శశిథరూర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే, గాంధీ కుటుంబం మద్దతు గెహ్లాట్‌కే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికపై ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా కౌంటింగ్, ఫలితం అక్టోబర్ 19న వెల్లడవుతుంది.