Sonia Gandhi: రిటైర్మెంట్‌పై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు
Sonia Gandhi: భారత్ జోడో యాత్రతో.. నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం సంతోషం కలిగిస్తోంది
Sonia Gandhi: రిటైర్మెంట్‌పై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో సోనియాగాంధీ ప్రసంగించారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం సంతోషం కలిగిస్తోందన్నారు. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది అని అన్నారు. వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఖర్గే నాయకత్వంలో విజయమే లక్ష్యంగా వచ్చే ఎన్నికలకు సిద్ధిం కావాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.