Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట
Amritpal Singh: సెర్చ్ ఆపరేషన్ కోసం పోలీసులకు సెలవులు రద్దు
Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట
Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులతో పాటు భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఈ నెలలో అమృత్ పాల్ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్‌ను పంజాబ్ పోలీసులు ముమ్మరం చేశారు. సెర్చ్ ఆపరేషన్ కారణంగా పంజాబ్ పోలీసులు ఏప్రిల్ 14 వరకు ఎలాంటి సెలవులు పెట్టకూడదని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
బైశాఖీ సందర్భంగా ఈ నెల 14న సమావేశం ఏర్పాటు చేయాలని అమృత్‌పాల్ సింగ్ అకాల్ తక్త్ చీఫ్‌ను అభ్యర్థించిన వీడియోలు కొద్దిరోజుల క్రితం వైరల్ అయ్యాయి. దీంతో పంజాబ్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. సెలవుల గురించి డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్14 వరకు ఇప్పటికే ఇచ్చిన సెలవులన్నింటిని రద్దు చేయడంతో పాటు, ఆయా విభాగాధిపతులు కొత్తగా ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్‌తో సంబంధం లేకుండా అందరూ డ్యూటీకి రావాలని పంజాబ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.