Corona: రోగనిరోధక శక్తిని బలహీన పరిచే మరో వేరియంట్ వచ్చిందంట తెలుసా...

Corona: శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనం చేసే కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ ఒక దానిని చత్తీస్‌గఢ్‌లో గుర్తించారు.

Update: 2021-04-02 01:50 GMT

కరోనా:(ఫైల్ ఇమేజ్)

Corona: ఇప్పటికే కరోనా, కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోన్న నేపధ్యంలో కొత్త కొత్త వేరియంట్లు వస్తూ దడపుట్టిస్తున్నాయి. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు అన్నట్లు ప్రకృతి ప్రకోపానికి గురికావాల్సి వస్తోంది. తాజాగా శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనం చేసే కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ ఒక దానిని చత్తీస్‌గఢ్‌లో గుర్తించారు. ఐదు వేర్వేరు నమూనాలను పరీక్షించిన అనంతరం ఈ వేరియంట్‌ను నిర్ధారించారు. దీనికి ఎన్-440గా నామకరణం చేశారు. దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ రోగ నిరోధకశక్తిని పిప్పిచేసే వేరియంట్ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

కొత్త వేరియంట్ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది. చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ మాట్లాడుతూ.. ఈ వైరస్ ప్రాణాంతకం కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించిన కేసులు నమోదు కాలేదన్నారు. కాగా, కొత్త వేరియంట్ రోగుల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. జీవన శైలిలో మార్పులు చేసుకుని ప్రకృతి అనుగుణంగా నడుచుకుంటే ఇలాంటి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

Tags:    

Similar News