Uttar Pradesh: కారును ఢీకొన్న పాఠశాల బస్సు.. ప్రమాదంలో ఆరుగురు మృతి
Uttar Pradesh: అదే సమయంలో మీరట్ నుంచి గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది
Uttar Pradesh: కారును ఢీకొన్న పాఠశాల బస్సు.. ప్రమాదంలో ఆరుగురు మృతి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే పై చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఘాజీపూర్ నుంచి రాంగ్‌రూట్‌లో వెళ్తున్న పాఠశాల బస్సు.. అదే సమయంలో మీరట్ నుంచి గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.