ఈ ఏడాది పూరీ జగన్నాధుడి రథయాత్ర వద్దు : సుప్రీంకోర్టు

Update: 2020-06-18 08:59 GMT

పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్‌ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో జగన్నాథ రథయాత్రను నిలిపేయాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతీయ వికాస్‌ పరిషత్‌ (బీవీపీ) దాఖలు చేసిన స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రజారోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రథయాత్ర నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని, ఇది కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించడానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించింది. రథయాత్రకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23 నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకునే రథయాత్రను ఆపుతున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

 

 

Tags:    

Similar News