Sabarimala: తెరుచుకున్న అయ్యప్పస్వామి ఆలయం.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్న భక్తులకే..

* ఇవాళ్టి నుంచి అయ్యప్ప స్వామి దర్శనం * రోజుకు 30 వేల మంది భక్తులకు అనుమతి

Update: 2021-11-16 07:43 GMT

 తెరుచుకున్న అయ్యప్పస్వామి ఆలయం(ఫైల్ ఫోటో)

Sabarimala: మండల మకవిలక్కు పర్వదినం సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. రెండు నెలల పాటు ఆలయంలో పూజలు చేస్తారు. ఇవాళ్టి నుంచి భక్తులను అనుమతించనున్నారు.

మండల పూజా ఉత్సవాల కోసం 41 రోజుల తెరిచి ఉంచనున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధృవపత్రం సమర్పించిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.

ఇక కరోనా నేపథ్యంలో క్యూలైన్‌లలో భౌతికదూరం, మాస్కు ధరించడం విధిగా పాటించాలని ఆదేశించింది. మరో వైపు భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు కొండపైకివచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో పంపానదిలో పుణ్యస్నానాలు నిలిపివేశారు. వర్షాల వల్ల శబరిమల కొండపై రాత్రి ప్రయాణాలు నిషేధించారు.

Tags:    

Similar News