Putin: రేపు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
Putin: రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటించనున్నారు. పుతిన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
Putin: రేపు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
Putin: రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటించనున్నారు. పుతిన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు వారు శ్రీకారం చుట్టనున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఇప్పటికే పుతిన్ తెలిపారు.
రెలోస్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక నిర్మాణాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పరస్పర మార్పిడి ఉంటుంది. బలగాల పంపిణీలోనే కాకుండా పరికరాలు, రవాణానూ రెలోస్ నియంత్రిస్తుంది. ఈ ఏర్పాటును సంయుక్త విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, విపత్తుల సమయంలో వినియోగిస్తారు.