Road Accident in Jharkhand: జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం.. 5 మంది మృతి..
Road Accident in Jharkhand: జార్ఖండ్‌లో శుక్రవారం జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Representational Image
Road Accident in Jharkhand: జార్ఖండ్‌లో శుక్రవారం జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గుమ్లా జిల్లాలోని బిషున్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నేతర్‌హాట్ హిల్స్ వద్ద ప్రమాదకర మలుపు వద్ద పనులు చేస్తుండగా బాక్సైట్ లోడ్ తో వెళ్తున్నట్రక్ ఒక్కసారిగా కొండపై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని ఒక అధికారులు తెలిపారు. ట్రక్ శిధిలాలలో ఒక వ్యక్తి చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నందున సహాయక చర్య జరుగుతున్నాయని సమాచారం.
మరో సంఘటనలో, ఇద్దరు యువకులు వారు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ను డీ కొట్టడంతో చక్రాల కింద పడి ఓక వ్యక్తి మరణించాడు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మర్ఘమధ్యంలోనే మరణించారు. ఈ ఘటన డియోఘర్ జిల్లాలోని కుండా మోర్‌లో జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ పియూష్ పాండే తెలిపారు. ఈ సంఘటన తరువాత ట్రాక్టర్ డ్రైవర్ వాహనం అక్కడ వదిలి పారిపోయాడని.. అతని పట్టుకోవటం కోసం సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.