ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య: సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు
RG Kar Doctor Case: ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా కోర్టు తేల్చింది.
ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య: సంజయ్ రాయ్ దోషిగా తేల్చిన కోర్టు
RG Kar Doctor Case: ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా కోర్టు తేల్చింది. శనివారం కోల్ కతా కోర్టు తీర్పును వెల్లడించింది. 2024 ఆగస్టు 9న ఉదయం జూనియర్ డాక్టర్ సెమినార్ హల్ లో మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. నైట్ షిఫ్ట్ లో ఉన్న ఆమె హత్యకు గురైన ఘటన దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు దిగారు. ఈ కేసులో దోషికి జనవరి 20న శిక్షను ఖరారు చేయనుంది. దీని ఆధారంగా పోలీసులు ఆయనను అప్పట్లో అరెస్ట్ చేశారు. తొలుత ఈ హత్యకు తనకు సంబంధం లేదని సంజయ్ రాయ్ చెప్పారు.
ఈ హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ఆగస్టు 13న కోల్ కత్తా పోలీసుల నుండి ఈ కేసుకు సంబంధించి ఫైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. 120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. సంజయ్ రాయ్ డీఎన్ఏ నమూనాలు, విసెరా వంటి సాక్షాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది. బాధితురాలి శరీరంపై ఉన్న లాలాజల నమూనాలను కూడా సంజయ్ రాయ్ నమూనాలతో పోలి ఉన్నాయని రిపోర్టులు తెలిపాయి.ఈ కేసులో అప్పట్లో ఆర్టీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ అభిజిత్ మండల్ అరెస్టయ్యారు. సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలతో అప్పట్లో వీరిని అరెస్ట్ చేశారు. జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనకు దిగారు.