Restriction on Domestic flights: దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు పొడిగింపు

Restriction on Domestic flights: కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది.

Update: 2020-07-25 09:04 GMT
Restriction on domestic flights to remain in effect till November 24

Restriction on Domestic flights: కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో దేశీయ విమాన ఛార్జీలపై గ‌తంలో విధించిన నియంత్ర‌ణ కూడా నవంబర్ 24 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అమలులో ఉంటుందని తెలిపింది.

కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. ఈ ఏడాది దీపావళి నాటికి దేశీయ విమానాల సంఖ్య గ‌తంతో పోలిస్తే 55 – 60 శాతానికి చేరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ఈ నెల మొదట్లో వెల్లడించారు. దేశీయ వాయు రవాణాలో నిరంతర మెరుగుదల ఉందని ఆయన అన్నారు, మే 25 న విమానాలలో ఎక్కిన 30,000 మంది ఫ్లైయర్స్ తో పోల్చితే.. జూలై ఆరంభంలో ఇది రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు, రెండు నెలల సస్పెన్షన్ తర్వాత ఈ రంగాన్ని దశలవారీగా తిరిగి ప్రారంభించడం ప్రారంభమైంది.

దేశీయ రంగాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో భాగంగా, గతంలో అనుమతించిన 33% విమాన కార్యకలాపాల సామర్థ్యాన్ని 45% కి పెంచాలని మంత్రిత్వ శాఖ గత నెలలో క్లియర్ చేసింది. మే 21 న ఆమోదించిన ఉత్తర్వులలో దేశీయ విమానాలను కేంద్రం ఆమోదించినా.. వేసవి షెడ్యూల్‌లో మూడో వంతుకు పరిమితం చేసింది.  

Tags:    

Similar News