Arvind Kejriwal: ఈడీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట
Arvind Kejriwal: సీబీఐ కేసులో కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
Arvind Kejriwal
Arvind Kejriwal: ఈడీ కేసులో కేజ్రీవాల్‌కి ఊరట లభించినా... సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడింగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో కేజ్రీవాల్‌ను విడివిడిగా ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, కేజ్రీ తరఫు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు లిక్కర్ పాలసీ స్కాం కేసులో కేజ్రీవాల్... సీబీఐ కస్టడీని జులై 25 వరకు పొడిగించింది.