జియో బంపర్ ఆఫర్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్‌ కంపెనీగా జియో ఉందని రిలయన్స్‌ అధినేత ముకేష్ అంబానీ అన్నారు. రిలయన్స్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలో జరిగింది.

Update: 2019-08-12 07:01 GMT

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్‌ కంపెనీగా జియో ఉందని రిలయన్స్‌ అధినేత ముకేష్ అంబానీ అన్నారు. రిలయన్స్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలో జరిగింది. గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్‌ రికార్డు సృష్టించిందన్నారు ముఖేష్ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజటల్‌ ప్లాట్‌ఫాంగా రిలయన్స్‌ జియో ఎదిగిందని తెలిపారు. ఇప్పటికే జియో ఖాతాదారుల సంఖ్య 34కోట్లు దాటిందని, 2030 నాటికి భారత్‌ 10 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ముఖేశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభించనున్నారు. 1600 నగరాల్లోని 2 కోట్ల నివాసాలు, 1.5 కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేశ్‌ తెలిపారు.

అనంతరం జియో ఫైబర్‌ ఫీచర్లను ఇషా, ఆకాశ్ అంబానీ వివరించారు. జియో సెట్‌టాప్‌ బాక్సు ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్‌ సేవలు ఉచితంగా చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Tags:    

Similar News