Reliance Industries: కరోనా పరీక్షలపై రిలయన్స్ బృందాలకు శిక్షణ

Reliance Industries: కరోనా పరీక్షలపై రిలయన్స్ బృందాలకు ఇజ్రాయిల్ బృందం శిక్షణ ఇవ్వనుంది.

Update: 2021-05-07 02:07 GMT

Reliance Industries:(File Image)

Reliance Industries: దేశ వ్యాప్తంగా కరోనా కమ్మేస్తోంది. లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడగా, వందల సంఖ్యలో మహమ్మారికి బలౌతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపచ వ్యాప్తంగా భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

కరోనా ర్యాపిడ్ పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడి నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఇజ్రాయిల్ బృందానికి అనుమతి ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్కడి ప్రభుత్వం అనుమతి కోరింది. కచ్చిత్తత్వంతో కూడిన కరోనా పరీక్షలు వేగంగా చేసేందుకు వీలుగా యంత్రాలను సమకూర్చేందుకు ఓ ఇజ్రాయిల్ స్టార్టప్ కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఈ ఏడాది జనవరిలో 15 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రభుత్వం తమ పౌరులు ఏడు దేశాలకు వెళ్లకుండా బ్యాన్ చేసింది.

ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే రిలయన్స్ విజ్ఞప్తి మేరకు ఇందుకు సంబంధించి అత్యవసర అనుమతులు పొందిన బ్రీత్ ఆఫ్ హెల్త్ కంపెనీ బృందం త్వరలోనే భారత్‌కు రానుంది. కంపెనీ ప్రతినిధులు ఇండియాకు వచ్చి రిలయన్స్ బృందాలకు ఆ కంపెనీ యంత్రాల వినియోగానికి సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా కరోనా పరీక్షలు వేగంగా చేయడానికి వీలు కలగడంతో పాటు తొందరగా ఈ వ్యాధిని గుర్తించే వీలు కలు ఈ కొత్త పరీక్షల ద్వారా కరోనా ఫలితం క్షణాల్లో వస్తుంది. ఇజ్రాయిల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వందల సంఖ్యతో యంత్రాలను కొనుగోలు చేయనుంది.

వీటి విలువ 15 మిలియన్ డాలర్లు ( మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 115 కోట్లు). వీటి ద్వారా నెలకు రూ. 76 కోట్ల వ్యయంతో కొన్ని లక్షల పరీక్షలు చేయడానికి వీలు కలుగుతుంది. బ్రీత్ ఆఫ్ హెల్త్ అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీ ద్వారా నిర్వహించిన కరోనా పరీక్షలు 95 శాతం విజయవంతమయ్యాయి. ఈ టెక్నాలజీ ద్వారా ఇజ్రాయిల్‌కు చెందిన హదాసా మెడికల్ సెంటర్, షెబా మెడికల్ సెంటర్ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ 98 శాతం సక్సెస్ అయ్యాయి. ఆర్టీపీసీఆర్ పరీక్షల కంటే ఈ టెక్నాలజీ ద్వారా జరిగే పరీక్షలు ఎంతో మెరుగని అంతర్జాతీయ మెడికల్ సంస్థలు తెలిపాయి.

ఈ కొత్త టెక్నాలజీ వినియోగానికి సంబంధించి యంత్రాలు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయని.. కరోనాపై పోరాటంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. భారత్‌కు వెళ్లి ఈ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే బృందాలను వారం క్రితం ఇజ్రాయిల్ డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి యేవ్ కిష్ బ్రీత్ ఆఫ్ హెల్త్ ల్యాబ్స్‌ను సందర్శించి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి స్వయంగా పరీక్షలు చేయించుకున్న మంత్రి.. బ్రీత్ ఆఫ్ హెల్త్ టీమ్‌ను అభినందించారు.

Tags:    

Similar News