చిన్నతరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మీడియా సమావేశంలో మరోసారి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మీడియా సమావేశంలో మరోసారి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రాలకు 60 శాతం డబ్ల్యూఎంఏ పెంపు ఉంటుందని, సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమల్లో ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ముంబయిలోని ఆర్‌బీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నామన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఇలాంటి సంక్షోభ సమయంలో బ్యాంకుల పాత్ర ప్రశంసనీయమన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు.. సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. భారత దేశంలో జీడీపీ 1.9 శాతంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ అంచనావేసింది. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికంగా తెలిపారు.
లాక్‌డౌన్ విధించడంతో ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని శక్తికాంత దాస్ అన్నారు. ఈ సందర్భగా మాట్లాడిన ఆయన ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌లో 2.3శాతం పెరిగాయి.36 శాతం ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్ వినియోం బాగా తగ్గింది. బ్యాంకుల కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. 2021-22 ఏడాది వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి. లాక్‌డౌన్ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశాం. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. అని శక్తికాంత దాస్ వివరించారు.
ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు..
* మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదు.
* సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్లు.
* జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు.
* నాబార్డుకు రూ.25వేల కోట్లు.
* చిన్నతరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు..
* రాష్ట్రాలకు 60శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు. సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు.
* రెపో రేటు యథాతథం.
* రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు.