Who is Ranveer Allahbadia: రణ్‌వీర్ అలహాబాదియ యూట్యూబ్ సంపాదన ఎన్ని కోట్లో తెలుసా?
Ranveer Allahbadia's net worth details: రణ్‌వీర్ అలహాబాదియ... గత మూడు రోజుల నుంచి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. సమయ్ రైనా అనే మరో యూట్యూబర్ రన్ చేసే ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రణ్‌వీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన్ను విమర్శల పాలయ్యేలా చేశాయి. అంతేకాదు, ఆయనపై వరుసగా పోలీస్ కేసులు కూడా నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా ఎంతో మంది సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు రణ్‌వీర్‌ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
ఇంతకీ ఎవరీ రణ్‌వీర్ అలహాబాదియ? ఎందుకు అంత పాపులర్ అయ్యారు?
రణ్‌వీర్ అలహాబాదియ 2014 లో బీర్‌బైసెప్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు. మొదట్లో ఫిట్నెస్ గురించి వీడియోలు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన రీచ్ పెంచుకోవడం కోసం ఆరోగ్యం, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్, ఆధ్యాత్మికత గురించి చెప్పడం మొదలు చేశారు. తన మాటలతో నెటిజన్స్‌ను ఆకర్షించారు.
సీన్ కట్ చేస్తే... ఈ పదేళ్లలో రణ్వీర్ అలహాబాదియకు ఎక్స్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్స్, యూట్యూబ్‌లో కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్‌లో భారీగా ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్ , పాడ్‌కాస్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. దీంతో బాలీవుడ్ టూ హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు చాలా మంది రణ్‌వీర్ అలహాబాదియకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆయన హోస్ట్ చేసే షోలకు గెస్టులుగా హాజరయ్యారు.
ఉదాహరణకు ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి సెలబ్రిటీలు కూడా రణ్‌వీర్ షోకు గెస్టులుగా వచ్చారు.
అలాగే ఆర్నాల్డ్ లాంటి ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ కూడా రణ్‌వీర్ పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యారు. దాంతో రణ్‌వీర్ అలహాబాదియాకు భారీ క్రేజ్ పెరిగింది.
ఇంటర్నెట్లో తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు విరాజ్ సేత్‌తో కలిసి మాంక్-ఈ స్టార్ట్ చేశారు. బీర్‌బైసెప్స్ స్కిల్‌హౌజ్, రాజ్, లెవెల్-మైండ్ బాడీ స్లీప్ జర్నల్ వంటివి మాంక్-ఈ బిజినెస్‌లో భాగమే.
రణ్‌వీర్ మొత్తం సంపాదన ఎంతో తెలుసా?
రణ్‌వీర్ అలహబాదియా క్రేజ్ ఎలా పెరుగుతూ వచ్చిందో అంతకు రెట్టింపు సంపాదన కూడా పెరిగింది. రణ్‌వీర్ అలహబాదియా ప్రస్తుతం రూ. 60 కోట్ల వరకు సంపాదించారని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం చెబుతోంది. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, దేని నుండి, ఎలా, ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వివరంగా చెబుతా వినండి.
యూట్యూబ్, పాడ్‌కాస్ట్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్, ఇతర వ్యాపారాలు అన్నీ కలిపి నెలనెల సగటున 35 లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. అంటే సంవత్సరానికి ఎంత లేదన్నా కనీసం 4 కోట్లకుపైమాటే. ఇక ఇలా సంపాదించిన డబ్బంతా రణ్‌వీర్ అలహబాదియా ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? ఆ పెట్టుబడిపై ఎంత సంపాదిస్తున్నారు అనేదానికి ఇక లెక్కలే లేవు.
జొమాటో, గ్రో, మై ప్రొటీన్ లాంటి వ్యాపార సంస్థల నుండే రణ్‌వీర్ అలహబాదియాకు నెలకు రూ. 10 లక్షల నుండి 15 లక్షల వరకు వస్తాయి. ది రణ్‌వీర్ షో అనే పాడ్‌కాస్ట్ నుండి మరో 5 నుండి 7 లక్షల రూపాయల వరకు వస్తాయి.
రణ్‌వీర్ అలహబాదియా వ్యాపారాలు
రణ్‌వీర్ అలహబాదియా స్థాపించిన మాంక్-ఈ అనేది టాలెంట్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ బిజినెస్. సోషల్ మీడియాలో బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడం లాంటివి ఇక్కడ చేస్తారు. ఇక బీర్‌బైసెప్స్ స్కిల్‌హౌజ్ అనే బిజినెస్ విషయానికొస్తే.. ఇదొక డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోర్సులు, బిజినెస్ ఎలా పెంచుకోవాలి అనే ఐడియాలు ఇస్తుంటారు. రాజ్ అనే మరో బిజినెస్ విషయానికొస్తే... ఇక్కడ అందం, అలంకరణ, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్‌మెంట్ లాంటి సేవలు అందిస్తారు.
ఈ బిజినెస్‌లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించే రణ్‌వీర్ అలహబాదియాకు క్రేజ్‌కు క్రేజ్... డబ్బుకు డబ్బు వచ్చిపడుతోంది. కానీ ఎంత క్రేజ్ ఉంటే మాత్రం ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు ఎలా అవుతుందని సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. రణ్‌వీర్ మాటలు భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను దిగజార్చేవిగా ఉన్నాయని అన్నిరంగాల ప్రముఖులు తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు.
ముఖేష్ ఖన్నా, కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్, ఫిలిం మేకర్ అశోక్ పండిట్, థైరోకేర్ ఫౌండర్ డా వేలుమణి లాంటి వారు రణ్‌వీర్ అలహాబాదియా తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్, పార్లమెంట్ ప్యానెల్ కూడా రణ్‌వీర్ అలహబాదియా వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తాను చేసింది తప్పేనని, తనని క్షమించండి అని ఆయన ఒక అపాలజీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ అప్పటికే జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. అదే షోలో రణ్‌వీర్ అలహబాదియాతో పాటు కూర్చున్న సమయ్ రైనా, మరో యూట్యూబర్ అపూర్వ ముఖిజ కూడా పోలీసు విచారణ ఎదుర్కుంటున్నారు. అదండీ రణ్‌వీర్ అలహబాదియా కాంట్రవర్శీ లేటెస్ట్ అప్‌డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం. మా వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.