Delhi Services Bill: దిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం..
Delhi Services Bill: అనుకూలంగా 131 ఓట్లు, ప్రతికూలంగా 102 ఓట్లు
Delhi Services Bill: దిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం..
Delhi Services Bill: ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు తొలుత ముజువాణి ఓటింగ్ నిర్వహించారు. ఆటోమేటిక్ ఓటింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో స్లిప్పులద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, ప్రతికూలంగా 102 ఓట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. ఇదివరకే లోక్ సభ ఆమోదించడంతో... రాష్ట్రపతి ఆమోదిస్తే... ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారబోతోంది. బిల్లుపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు అంశంలో ఎక్కడా... సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించలేదని సభకు వివరణ ఇచ్చారు.