భారత్‌కు చెందిన అంగుళం భూమి కూడా వదలం - రాజ్‌నాథ్ సింగ్
* చైనాతో కీలక ఒప్పందానికొచ్చాం- రాజ్‌నాథ్ సింగ్ * దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సవాళ్లకు సిద్ధమని.. * భారత సైన్యం నిరూపించింది- రాజ్‌నాథ్ సింగ్
Rajnath singh image from (the Hans Inda)
భారత్‌కు చెందిన అంగుళం భూమి కూడా వదులుకునేది లేదన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమనే విషయాన్ని మన సైన్యం నిరూపించిందని కొనియాడారు. లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై రాజ్యసభలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.