నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

Sushil Chandra: భారత ఎన్నికల ప్రధాన అధికారి-సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు.

Update: 2022-05-12 10:48 GMT

నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

Sushil Chandra: భారత ఎన్నికల ప్రధాన అధికారి-సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఆమేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. న్యాయశాఖ సూచనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324లోని రెండో క్లాస్‌ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత ఎన్నికల ప్రధాన అధికారిని నియమించారు. ప్రస్తుత సీఈసీ సుశీల్‌ చంద్ర పదవీ కాలం ఈనెల 14న పూర్తి కానున్నది. 15న రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్‌ఖకు ట్విట్టర్‌ ద్వారా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన కాపీని రిజుజు ట్వీట్‌ చేశారు.

1960 ఫిబ్రవరి 16న జన్మించిన రాజీవ్‌ కుమార్‌ బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ పబ్లిక్‌ పాలసీ పూర్తి చేశారు. 1984 బ్యాచ్‌ బీహార్‌ కేడర్‌కు చెందిన ఐఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తించారు. 2020లో పదవీ విరమణ పొందారు. ఆ తరువాత పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు -పీఈఎస్‌బీ చైర్మన్‌గా 2020 ఏప్రిల్‌లో నియామకమయ్యారు. 2020 సెప్టెంబరు 1న ఎన్నికల అధికారిగా ఎన్నికల సంఘంలో చేరారు. రాజీవ్‌కుమార్‌కు 36 ఏళ్ల పాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో సేవలందించిన అనుభవం ఉంది. 

Tags:    

Similar News