కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌ కుమార్‌

Update: 2020-09-01 09:13 GMT

Rajeev Kumar: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేసిన అశోక్‌ లావాసా స్థానంలో రాజీవ్‌ కుమార్‌ నియామకం జరిగింది. సెప్టెంబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ 36 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన పబ్లిక్ ఎంటర్‌ప్రై‌జెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. గత నెల 31వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. దీంతో ఆయన మంగళవారం ఎన్నికల కమిషనర్ గా బాద్యతలు చేట్టారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన పని చేయనున్నారు.


Tags:    

Similar News