Sachin Pilot: మెత్తబడ్డ సచిన్ పైలట్.. కాంగ్రెస్ సర్కారుకు ఊపిరి

Sachin Pilot: రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ గందరగోళానికి ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది.

Update: 2020-07-13 13:15 GMT

Sachin Pilot: రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ గందరగోళానికి ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఢోకా ఏమి లేదు. నిన్నటిదాకా ప్రభుత్వానికి షాక్ ఇస్తారని భావించిన సచిన్ పైలట్ మెత్తబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కలుగజేసుకొని గెహ్లాట్, సచిన్ మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే ఇదే క్రమంలో ఆమెముందు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. పీసీసీ చీఫ్ గా తననే కొనసాగించాలని.. అలాగే తన వర్గంలోని ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని.. అందులో ఆర్ధిక, హోమ్ శాఖ మస్ట్ గా ఉండాలని కండిషన్ పెట్టారట. అయితే ఇందులో కొన్నింటికి మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే సీఎం అశోక్ గెహ్లాట్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం (సీఎల్పీ) ముగిసింది. ముఖ్యమంత్రి గెహ్లాట్ ‌కు మద్దతు ప్రకటిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఈ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారనే విషయంపై క్లారిటీ లేదు కానీ.. 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని సీఎం‌ వర్గీయులు చెబుతున్నారు. ఇక సచిన్ పైలట్ మెత్తబడడంతో శాసనసభ పక్షానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కాగా తనకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.



Tags:    

Similar News