Rajasthan Political Crisis : రాజ్ భవన్ ను ముట్టడించిన రాజస్థాన్ సీఎం

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయ సంక్షోభ సెగ రాజ్ భవన్ ను తాకింది.

Update: 2020-07-24 15:38 GMT

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయ సంక్షోభ సెగ రాజ్ భవన్ ను తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. కానీ గవర్నర్ కలరాజ్ మిశ్రా గెహ్లాట్ వినతిని తిరస్కరించడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. దాంతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ ను ముట్టడించారు అశోక్ గెహ్లాట్. రాజ్ భవన్ పరిసరాల్లో తీవ్ర ఉదృతత పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్ గెహ్లాట్ గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ లోపలి వెళ్లగా.. ఎమ్మెల్యేలు అంత బయట బైఠాయించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు అందరూ అశోక్ గెహ్లాట్ కు మద్దతుగా.. సచిన్ పైలట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సచిన్ పైలట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశోక్ మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ ను కలిశారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపరచడం సాధ్యం కాదని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో అశోక్ గెహ్లాట్ ఆగ్రహావేశాలతో ఉన్నారు. అక్కడినుంచి వెళ్లిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతోనే గవర్నర్ అసెంబ్లీ భేటీకి అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో మళ్ళీ మూడు గంటలకు రాజ్ భవన్ కు చేరుకున్న అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో తన బలాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీని సమావేశపరచాలని శాసనసభ్యులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని గవర్నర్ కు వివరించారు. 

Tags:    

Similar News