Rajasthan: ఎడారి రాష్ట్రంలో హీటెక్కిన రాజకీయాలు

Rajasthan: సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్ వర్గాల మధ్య భగ్గుమన్న విభేదాలు

Update: 2022-09-25 16:00 GMT

Rajasthan: ఎడారి రాష్ట్రంలో హీటెక్కిన రాజకీయాలు 

Rajasthan: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో క్యాంప్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సచిన్ పైలెట్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓవైపు సీఎం గెహ్లాట్ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతుండగా మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెహ్లాటే కొనసాగలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌ను ఒప్పుకునేదే లేదంటూ ఎమ్మెల్యేలు రెబల్ జెండా ఎగురవేస్తున్నారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

సీఎం పదవికి గెహ్లాట్ రాజీనామా చేయోద్దని డిమాండ్ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దీంతో రాజస్థాన్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాసేపటి క్రితం మంత్రి శాంతి దార్లివాల్ నివాసంలో భేటీ అయిన మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు గెహ్లాటే సీఎంగా ఉండాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మీడియాకు వివరిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇదిలా ఉంటే మరోవైపు..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే స్వేచ్చ ఉందన్నారు సీఎం అశోక్ గెహ్లాట్. 

Tags:    

Similar News