రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 20 మంది మృతి

Rajasthan Bus Fire Tragedy: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.

Update: 2025-10-15 05:59 GMT

రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 20 మంది మృతి

Rajasthan Bus Fire Tragedy: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రయాణిస్తున్న ఏసీ స్లీపర్‌ బస్సులో మంటలు వ్యాపించడంతో 20 మంది మరణించినట్టు పోలీసులు తెలిపారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్‌ సర్క్యూటే ఇందుకు కారణమని భావిస్తున్నారు. జైసల్మేర్‌-జోధ్‌పూర్‌ నేషనల్ హైవే థయ్యాత్‌ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

ఆకస్మికంగా మంటలు చెలరేగి బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. కొందరయితే నడుస్తున్న బస్సు నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు.

Tags:    

Similar News